కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న ’18 పేజీస్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ గ్యాప్ లో ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇందులో నిఖిల్ సిగరెట్ తాగుతూ.. కాలిపోతున్న ఓ పేజీని పట్టుకొని ఉన్నాడు. ఆ పేజీపై జూన్ 1న ’18 పేజీస్’ ఫస్ట్ లుక్ అని రాసి ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఫస్ట్ లుక్ ను ఎలా డిజైన్ చేశారో చూద్దాం.
18 Pages…
When Feelings Burn 🔥❤
1st Look on 1st June… @aryasukku @GA2Official #AlluAravind #BunnyVas @dirsuryapratap @SukumarWritings @anupamahere pic.twitter.com/uGsbi3x0aL— Nikhil Siddhartha (@actor_Nikhil) May 28, 2021
కాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































