మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి ” మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా విడుదల వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకోగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామనీ , “ఖిలాడి ” మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ మేకర్స్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి ” మూవీ తరువాత దర్శకులు త్రినాథ రావు నక్కిన , శరత్ మండవ మూవీస్ కు హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే మూవీ కి హీరోయిన్ గా మలయాళ హీరోయిన్ రజిష విజయన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. సూపర్ హిట్ “అనురాగ కరిక్కిన్ వెల్ల మ్ “(2016 ) మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన రజిష , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. పలు మలయాళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రజిష, సూపర్ హిట్ “కర్ణన్ ” మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. 2 మలయాళ మూవీస్ లో నటిస్తున్న రజిష , కార్తీ హీరో గా రూపొందుతున్న “సర్దార్ “, సూర్య హీరోగా రూపొందుతున్న తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: