‘ఏక్ మినీ కథ’.. ఈ రీజన్సే సినిమాకు ప్లస్ పాయింట్స్

A Quick Rundown Of Top Reasons To Watch Ek Mini Katha Movie Releasing Tomorrow On Amazon Prime,Ek Mini Katha On Prime,Ek Mini Katha On Prime Video,Santosh Shobhan,Merlapaka Gandhi,Ek Mini Katha Movie Concept,Ek Mini Katha Music,Ek Mini Katha Movie Songs,Ek Mini Katha Songs,Ek Mini Katha OTT Release,Praveen Lakkaraju,Kavya Thapar,Brahmaji,Nellore Sudarshan,Reasons To Watch Ek Mini Katha Telugu Movie,Reasons To Watch Santosh Shobhan Starrer Ek Mini Katha,Reasons To Watch Santosh Shobhan Ek Mini Katha,Santosh Shobhan Ek Mini Katha,Telugu Filmnagar,Santosh Shobhan Ek Mini Katha Movie Updates,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Update,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Movie Telugu,Reasons To Watch Ek Mini Katha,Reasons To Watch Santosh Shobhan Ek Mini Katha Movie,Reasons To Watch Santosh Shobhan Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha From 27th May,Ek Mini Katha OTT Release Tomorrow,Ek Mini Katha Movie Update,Reasons To Watch Santosh Shobhan Ek Mini Katha Film,Ek Mini Katha On May 27th,Ek Mini Katha OTT Release On 27th May On Prime Video,Brahmaji,Shraddha Das,Sudharshan,Sapthagiri,Posani Krishna Murali,#EkMiniKathaOnPrime

కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా వస్తున్నసినిమా ఏక్ మినీ కథ. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 27న రిలీజ్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమాకు మంచి బజ్ యే ఉంది. మరి ఈసినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో.. చూడటానికి రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాన్సెప్ట్.. ముందుగా ఈసినిమాకు అంత క్రేజ్ రావడానికి కారణం కాన్సెప్ట్. టైటిల్ తోనే కథ ఎలా ఉండబోతుందో అర్థమయ్యేలా చూపించారు మేకర్స్. కాస్త ఎమన్నా డౌట్ ఉన్నా టీజర్, ట్రైలర్ లతో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ సినిమా రాలేదని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా హిలేరియస్ గా ఉందంటూ ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

సంతోష్ శోభన్.. హీరో సంతోష్ శోభన్ కూడా ఈసినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. దానికి తోడు ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోల సపోర్ట్ కూడా ఈసినిమాకు దక్కుతుండటంతో ఈసినిమాకు ఊహించనంత క్రేజ్ దక్కింది.

ఫన్.. ఏ సినిమాకు అయినా మన తెలుగు ప్రేక్షకులు కోరుకునేది కొంచం కామెడీ. ఈ సినిమాలో అది కావాల్సినంత దొరుకుతుంది అని చెప్పొచ్చు. సుదర్శన్ – సంతోష్, బ్రహ్మాజీ-సంతోష్ మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా హైలెట్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది.

మేర్లపాక గాంధీ.. డైరక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథను అందించాడు. మరి మేర్లపాక గాంధీ సినిమాల గురించి మనకు తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన కృష్ణార్జున యుద్దం మిశ్రమ ఫలితం దక్కించుకున్న కథ, కామెడీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈసినిమాలో కూడా మేర్లపాక మార్క్ కనిపిస్తుంది.

ఓటీటీ రిలీజ్.. ప్రస్తుతం థియేటర్లు లేవు.. టైమ్ దొరికితే చాలు ఏదో ఒక సినిమా చూసే సినీ లవర్స్ కు మాత్రం ఇది బోరింగ్ విషయమే. దానికితోడు ఈమధ్య కాలంలో పెద్దగా ఓటీటీలోకి సినిమాలు రావడం లేదు ఇలాంటి టైమ్ లో ఈసినిమా అమెజాన్ లో మే 27న రిలీజ్ అవ్వబోతుంది. మరోవైపు ఇలాంటి బోల్డ్ కంటెంట్ ను థియేటర్ లో చూడటానికి ఇబ్బందిపడేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా ఇంట్లోనే ఎంచక్కా సినిమాను చూసేయొచ్చు..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here