అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో వస్తున్న పుష్ప సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తన మేకోవర్, కథ వీటితోపాటు క్యాస్టింగ్ లో కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళుతున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాలో అనసూయ కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తను పుష్ప షూటింగ్ లో కూడా జాయిన్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా అనసూయ ఈసినిమాలో తన పాత్ర గురించి చెప్పింది అనసూయ. ఈసినిమాలో పాత్ర కూడా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో పాత్ర లాగే ఉంటుందని.. ఈ పాత్ర కూడా సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని.. ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయకూడదని చెప్పింది. మరోవైపు ఈసినిమాలో సునీల్ కూడా ఉన్నాడని.. సునీల్ వైఫ్ గా అనసూయ నటిస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి.
మరి సుకమార్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ను అనసూయ కోసం డిజైన్ చేశాడు.. సినిమా లో టర్నింగ్ పాయింట్ అదే. అనసూయ కూడా ఆరోల్ కు అలాగే న్యాయం చేసింది కాబట్టే ఇప్పటికీ కూడా రంగమ్మత్త అనే పిలుస్తుంటారు. మరి సుకుమార్ సినిమా అంటే ఖచ్చితంగా ప్రతి పాత్రకుఅంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈసినిమాలో అనసూయకు ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడో చూద్దాం..
మరోవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల అంతకాకుండా బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. ఈ సినిమా లో విలన్ పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. మరి టీజర్ తోనే ఈసినిమా ఎలా ఉంటుందో చూపించాడు సుకుమార్. అలాంటిది సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: