మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ ” గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “సర్కారు వారి పాట ” మూవీ దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. మరో షూటింగ్ షెడ్యూల్ ఉగాది రోజున ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ కారణం గా “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది. దుబాయ్ లో తెరకెక్కించిన ఫైట్ సీక్వెన్స్”సర్కారు వారి పాట ” మూవీ కి వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ గా నిలవనుంది. ఎడారి లో ఒక స్పెషల్ సెట్ లో ఫైట్ ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తెరకెక్కించారు. మహేష్ బాబు కై ఫైట్ మాస్టర్స్ ఫైట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసినపోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్”సరిలేరు నీకెవ్వరు” మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























