కొంతమంది డైరెక్టర్లు ఉంటారు.. చేసేవి తక్కువ సినిమాలు అయినా మంచి పేరు తెచ్చుకుంటారు. అలాంటి డైరెక్టర్లలో కెవి ఆనంద్ కూడా ఉంటాడు. కెమెర మెన్ లు డైరెక్టర్ గా మారి సినిమాలు చేయడం చూస్తుంటాం.. ఇక కెవి ఆనంద్ కూడా మొదట కెమెర మెన్ గా చేసి ఆతరువాత డైరెక్టర్ గా మారినవాడే. జీవా నటించిన రంగం.. సూర్య నటించిన బ్రదర్స్ చిత్రాలతో అతడి ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అలాంటి డైరెక్టర్ తుది శ్వాస విడిచారు. కెవి ఆనంద్ గుండెపోటుతో నేడు చెన్నైలో కన్నుమూశారు. కెవి ఆనంద్ మృతితో తెలుగు, తమిళ పరిశ్రమలు విషాదంలోకి వెళ్లాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కె.వి.ఆనంద్ మొదట ఫోటో జర్నలిస్టుగా పనిచేశారు. ఆతరువాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కు దగ్గర సహాయకుడిగా పని చేసి… శ్రీరామ్ సిఫారసుతో మలయాళ చిత్రం తెన్మావిన్ కొంబాత్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆసినిమాకు గాను ఆనంద్ జాతీయ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అనంతరం మిన్నారామ్, చంద్రలేఖ, ముదల్వన్, జోష్, నాయక్, బాయ్స్, ఖాకీ, శివాజీ వంటి చిత్రాలకు పని చేశారు. 2005 లో కన కందెన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆతరువాత పలు సినిమాలు తీసినా రంగం, వీడొక్కడే, బ్రదర్స్ సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ఇక తెలుగులో కూడా ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించారు కెవి ఆనంద్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























