‘ఆచార్య’ రిలీజ్ కూడా వాయిదా

Mega Star Chiranjeevi Starrer Acharya Movie Release Got Postponed Amid Surge In The Cases Of Corona Virus,Telugu Filmnagar,Telugu Film News 2021,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Latest News,AcharyaMovie Latest Updates,Acharya Postponed,Acharya Movie Postponed,Chiranjeevi Starrer Acharya Postpones Its Release Amid Surge In Covid-19 Cases,Chiranjeevi Starrer Acharya Release Date Postponed,Chiranjeevi Starrer Acharya Postpones Its Release,Chiranjeevi Acharya Release Date Postponed,Chiranjeevi Starrer Acharya Postponed,Chiranjeevi Acharya Postponed,Acharya Movie Release Postponed,Chiranjeevi Starrer Acharya Postponed Due To Surge In Covid-19 Cases,Acharya Movie Release Got Postponed,Acharya Movie Release Update,Acharya Movie Release News,Acharya Release Postponed,#Acharya,#AcharyaPostponed

కరోనా సెకండ్ వేవ్ అంటూ కోరలు చాచింది. మళ్లీ గత ఏడాది పరిస్థితే వచ్చింది. లాక్ డౌన్ లు మొదలయ్యాయి. షూటింగ్ లు రద్దయ్యాయి. థియేటర్స్ మూత పడుతున్నాయి. రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చిన్న సినిమాలు చాలా వరకూ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పెద్ద సినిమాలపై కూడా పడుతుంది. ఇక అనుకున్నదే జరిగింది.. ఈనేపథ్యంలోనే ఆచార్య కూడా వెనక్కి తగ్గాడు. మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాను మే13న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు.. మే 13న రావడం కష్టమే. దానికితోడు కరోనా రావడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేసింది. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘ఆచార్య’ చిత్రాన్ని మే 13న విడుదల చేయడం లేదని.. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

 

కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.