జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే కదా. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా ముందుగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. . ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పవన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పవన్ ను ఓ యంగ్ ప్రొడ్యూసర్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సూర్యదేవర నాగవంశీ. పవన్ తో నాగవంశీకి మంచి రిలేషన్ ఉంది. దీంతో పవన్ పక్కనే ఉండి నాగవంశీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో త్వరలోనే పవన్ కోలుకొని తిరిగొస్తారని అంటున్నారు.
పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కూడా చేస్తున్నాడు. ఈసినిమాను నాగవంశీనే తన బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























