‘మేజర్’ టీజర్ రిలీజ్

Adivi Sesh Major Movie Teaser Is Out Now,Adivi Sesh’s Major Movie Teaser Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major Telugu Movie Latest News,Major Teaser,Major Movie Teaser,Major Telugu Movie Teaser,Major Official Teaser,Major Latest Teaser,Major New Teaser,Adivi Sesh Major Teaser

టాలెంటెడ్‌ హీరో అడివిశేష్‌ హీరోగా నటిస్తోన్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా టీజర్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు తాజాగా నాని టీజర్ చూశానని.. ఈమధ్య కాలంలో వచ్చిన బెస్ట్ టీజర్ అని కితాబిచ్చాడు.. అంతేకాదు గతకొద్దిరోజుల క్రితం రాహుల్ రవీంద్రన్ కూడా టీజర్ చూశానని చాలా బావుందని చెప్పడంతో ఆ క్యూరియాసిటీ మరింత ఎక్కువైంది. ఇక ఇప్పుడు పైనల్ గా టైమ్ రానే వచ్చేసింది.. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్‌ ని ముగ్గురు స్టార్లు రిలీజ్ చేశారు. తెలుగులో మహేష్‌ బాబు , హిందీలో సల్మాన్‌ ఖాన్‌, మలయాళంలో పృథ్వీ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ అయింది. ‌

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శేష్ సినిమాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి అన్నసంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టీజర్ కూాడా ఆకట్టుకుంటుంది. ‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ శేష్‌ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ఈసారి కూడా శేష్ తన ఖాతాలో మరో హిట్ ను వేసుకోవడం ఖాయం అంటున్నారు.

కాగా పాన్‌ ఇండియామూవీగా ఈ మేజర్‌ తెరకెక్కుతోంది. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది.మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మేజర్ సినిమా జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.