సూపర్ హిట్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది. కీర్తి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న కీర్తి సురేష్ గురువాయూర్ టెంపుల్ ను దర్శించుకున్నారు. హాఫ్ శారీ లో అందంగా ఉన్న తన ఫొటోస్ ను కీర్తి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ లో కీర్తి సింపుల్ , హ్యాపీ గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























