సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి , బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయికలు. “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ 40 శాతం పైగా కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి ! ” మూవీ రూపొందనుందని విషయం తెలిసిందే. టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. వరస మూవీస్ తో హీరో నాని తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. నాని కథానాయకుడిగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: