హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాదే మొదలైంది. లాక్ డౌన్ కి ముందే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇంకా పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈ సినిమా జైసల్మేర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ తన ట్విటర్ ద్వారా తెలియచేస్తూ గుడ్ స్టార్ట్ విత్ గుడ్ షాట్ అంటూ ఒక చిన్న వీడియో ను పోస్ట్ చేసాడు.
Good start with good shot💥👇#seetimaar #jaiselmer pic.twitter.com/XlqufNEua5
— Sampath Nandi (@IamSampathNandi) February 9, 2021
కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తుంది. తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కూడా నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























