సినిమాలు, ఫ్యామిలీ కేవలం వ్యక్తిగత విషయాలే కాదు అప్పుడప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ విషాదంపై కూడా స్పందించి విచారం వ్యక్తం చేసాడు సూపర్ స్టార్ మహేష్. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ధౌలిగంగా విషాదం అందరినీ కలిచివేస్తుంది. హిమాలయ మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఉప్పొంగిన దౌలీగంగా నదికి వరద ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ ప్రవాహంతో 170 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాకుండా చేసింది. ఇప్పటి వరకూ 10 శవాలను వెలికి తీయగా.. అతికష్టం మీద 16 మంది రక్షించగలికారు సహాయ సిబ్బంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిపై మహేష్ కూడా స్పందించి.. ప్రస్తుతం తన ఆలోచనలు, ప్రార్థనలు ప్రమాదంలో చిక్కుకున్న వారిగురించే.. ఘటనలో గల్లంతైన వారందరూ క్షేమంగా బయటపడాలని.. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐటీబీపీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు.
My thoughts and prayers are with the people of #Uttarakhand at this time. Praying for everyone’s safety and well-being. A big salute to the @ITBP_official jawans deployed for search and rescue operations. 🙏🙏
— Mahesh Babu (@urstrulyMahesh) February 7, 2021
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను… మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరగనుంది. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. ఇక ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























