‘ఆదిపురుష్’‌ సెట్ లో అగ్నిప్రమాదం

Prabhas Adipurush Movie Set Caught In A Fire Accident,Adipurush,Prabhas,Adipurush,Adipurush Shooting,Actor Prabhas,Major Fire On Adipurush Sets,Saif Ali Khan,Fire Breaks Out On Adipurush Sets,Adipurush Sets in Mumbai,Adipurush Set Fire Accident,Adipurush Set Fire,Adipurush Fire Accident,Adipurush Fire,Adipurush Set Fire Accident Video,Fire Accident In Adipurush Movie Set,Adipurush Accident,Adipurush Sets On Fire,Adipurush Sets Fire Accident,Fire Accident,Adipurush Set,Adipurush Set Accident,Fire Accident On Sets Of Prabhas Adipurush,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates

ఆదిలోనే ఆటకం కలిగింది ఆదిపురుష్ టీంకి. ఈ రోజే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. అలా ప్రారంభించారో లేదో సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఎంత తీవ్రత ఉందో. ఈ ప్రమాదంలో సెట్ చాలా వరకూ కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే అదృష్టం ఏంటంటేప్రమాదం జరిగినప్పుడు అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దాంతో యూనిట్ అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని సమాచారం. ఇక షూటింగ్‌ మొదలైన మొదటి రోజే సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడంపై అటు చిత్ర యూనిట్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు  ఇప్పటికే ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.