హీరో రవితేజ ప్రస్తుతం ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో రవితేజ ద్విపాత్రాభినయం తో తెరకెక్కుతున్న “ఖిలాడి “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “క్రాక్ ” మూవీ ఘనవిజయం సాధించడం తో హీరో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “ఖిలాడి “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ “ఖిలాడి “ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్ లో చేతిలో రాడ్ పట్టుకుని మాస్ లుక్ తో హీరో రవితేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రూపొందిన “ఖిలాడి “ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. సూపర్ హిట్ “క్రాక్ ” మూవీ తో అలరించిన రవితేజ “ఖిలాడి “మూవీ తో అలరించనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























