‘క్రైమ్ థ్రిల్ల‌ర్’ గా న‌వీన్‌చంద్ర కొత్త సినిమా

Naveen Chandra’s New Crime Thriller Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Chandra,Naveen Chandra Latest News,Naveen Chandra Upcoming Movie News,Naveen Chandra Next Project News,Naveen Chandra Latest Film Details,Naveen Chandra New Project News On Cards

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన టాలెంటెడ్ హీరో న‌వీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మ‌ధ్య విల‌న్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫరెంట్ కథతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న‌వీన్ చంద్ర‌‌ హీరోగా అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, తెలుగు, తమిళ భాషల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఈసినిమాను ఈ నెల‌లోనే గ్రాండ్ గా లాంచ్ చేసి ఫిబ్ర‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.

కాగా న‌వీన్‌చంద్ర హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్‌, స్మిర్తి వెంక‌ట్‌, ఎమ్‌.గోపి, పూజా రామ‌చంద్ర‌న్‌, స‌త్యం రాజేష్‌, సిరి, న‌వీనా రెడ్డి, సుద‌ర్శ‌న్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.జి ముత్త‌య్య సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.