వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం జైసేన. ఈ సినిమాకూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.జనవరి 29న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ – “మా జైసేన సినిమా జనవరి 29న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మా అన్నయ్యలు సునీల్‌గారు, శ్రీకాంత్‌గారు, నా బెస్ట్ ఫ్రెండ్ తారకరత్న, శ్రీరామ్, శ్రీ, కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ నటించారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. సునీల్ గారు ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆయన పొలీసుగా చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. జైసేన అనగానే అందరికీ జనసేన అన్నట్టుగా వినపడుతుంది. అది నిజమే ఎందుకంటే జనసేన అనేది పవన్‌కళ్యాణ్ గారి పార్టీ మేమందరం దాన్ని అభిమానిస్తాం అలాగే జైసేన సినిమా పవన్‌కళ్యాణ్ గారి భావాలకు దగ్గరిగా ఉండే సినిమా. అలాగే రైతుల సమస్యల గురించి సినిమాలో ఈ చర్చించడం జరిగింది. రైతులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని కూడా ఈ మూవీలో చూపించాం. అందుకే ఈ సినిమాని రైతులకి అంకితం చేస్తున్నాం. రైతులకి సపోర్ట్ అందించడం మనందరి భాధ్యత అని చెప్పే సినిమా. రైతుల కోసం తీసిన కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ – “నా స్కూల్ డేస్‌లో ఏదైనా సినిమాకి వెళ్తాను అంటే ఆదివారం పూట టి.కృష్ణగారి రేపటిపౌరులు, నేటి భారతం వంటి సినిమాలకి తీసుకెళ్లేవారు. ఎందుకంటే ప్రస్తుత సమాజం ఎలా ఉంది?. ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కోంటున్నారు? అని తెలుస్తాయని. అలా తెలుసుకోవడం చాలా అవసరం. మా తాత గారు ఒక రైతు. నేను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లకపోతే నన్ను పొలం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఒక రైతుకు మన అవసరం లేకున్నా.. మనందరికీ రైతు అవసరం తప్పకుండా ఉంటుంది.అందుకని వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఐపీయస్ ఆఫీసర్‌గా నటించడం జరిగింది. నా క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. జనరల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తుంటాం..కాని ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం చాలా రేర్‌గా వస్తుంది. రైతుల సమస్యలని పదిమందికి చెబుతూ ఒక మంచి పరిష్కారాన్ని చూపించడం చాలా గొప్ప విషయం. ఒక మంచి ఆశయంతో తీసిన సినిమా కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
కాగా ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ తదితరులు నటిస్తున్నారు. వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































