లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో కల్కి కృష్ణ మూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా చోళ రాజవంశం నేపథ్యంలో హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్” మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్” మూవీ థాయ్ ల్యాండ్ , తమిళనాడు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. “పొన్నియిన్ సెల్వన్” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లోఈ రోజు ప్రారంభం అయ్యింది. విక్రమ్ , ఐశ్వర్య రాయ్ లతో పాటు ముఖ్య తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కొరియోగ్రాఫర్ బృంద పర్యవేక్షణ లో ఒక సాంగ్ తెరకెక్కిస్తున్నారు. “పొన్నియిన్ సెల్వన్” మూవీ తమిళ భాషతో పాటు పలు భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. “పొన్నియిన్ సెల్వన్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































