రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పవన్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది రేణు. ఇక తాజాగా అకీరా చేసిన మీమ్ ఒకటి పోస్ట్ చేసింది. వారు పెంచుకునే రెండు పిల్లులు ఉంటే పెద్దది చిన్న పిల్లిని రెండు చేతుల్లో పట్టుకొని ఉంది. దానికి పెద్ద దాని చేతుల్లో నలిగిపోయినట్టుగా 2020వ సంవత్సరంపై అకీరా ఫన్నీ మీమ్ క్రియేట్ చేసాడు. పైగా ఆ ఫోటోను కూడా అకీరానే తీసి ఆ మీమ్ ను తయారు చేసినట్టుగా రేణు దేశాయ్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి మరో సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్.
దానితో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది రేణు. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























