హైదరాబాద్ లో ఐశ్వర్య రాయ్

Aishwarya Rai Heads To Hyderabad For Mani Ratnam Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aishwarya Rai shooting in Hyderabad,Actress Aishwarya Rai,Heroine Aishwarya Rai,Aishwarya Rai,Aishwarya Rai Heads To Hyderabad,Mani Ratnam,Mani Ratnam Movie Shooting,Aishwarya Rai Heads To Hyderabad For Mani Ratnam Movie,Aishwarya Rai shooting in Hyderabad For Mani Ratnam Movie,Aishwarya Rai in Hyderabad For Mani Ratnam Movie Shooting

మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ ,మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన “ఇరువర్ ” తమిళ తో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ “ఔర్ ప్యార్ హోగయా” మూవీ తో ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో ఐశ్వర్య కథానాయికగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ “జీన్స్ “, “రోబో “వంటి మూవీస్ తో ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “హమ్ దిల్ దే చుకే సోనమ్ “, “దేవదాస్ ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఐశ్వర్య బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2010 సంవత్సరం లో “ఏంథిరన్ “(రోబో ) మూవీ నటించిన ఐశ్వర్య 10 సంవత్సరాల తరువాత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మద్రాస్ టాకీస్ ,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా భారీ బడ్జెట్ , తారాగణం తో “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ లో చియాన్ విక్రమ్, కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ల తో పాటు బిగ్ బీ అమితాబ్
ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు . “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికై ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ , తనయ ఆరాధ్య తో హైదరాబాద్ చేరుకున్నారు. “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ లో తన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యేంతవరకూ ఐశ్వర్య హైదరాబాద్ లో ఉంటారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.