సోనుసూద్ పై చిరు ప్రశంసలు – వీరులు పుట్టరు.. తయారవుతారు

Mega Star Chiranjeevi Is All Praises For Actor Sonu Sood

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ లాక్‌డౌన్ కాలంలో వ‌ల‌స కార్మికులకు సాయం చేసిన అనుభ‌వాల‌ను గుర్తు చేస్తూ పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబ‌యోగ్ర‌ఫీ (సోనూసూద్‌ ఆత్మ‌క‌థ)‌ ‘ఐ యామ్ నో మెస్సీయ’‌ పుస్త‌కం రాసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న సోనూసూద్ సెట్స్ లో ఈ పుస్త‌కాన్ని చిరంజీవికి అంద‌జేశాడు. ఈ  విష‌యాన్ని చిరంజీవి ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వీరులు త‌యార‌వుతారు..పుట్ట‌ర‌ని మీ పుస్త‌కంతో మ‌రోసారి నిరూపించారు. వేలాదిమందికి సాయం చేస్తూ సాగిన నీ ప్ర‌యాణం కోట్లాదిమందికి స్పూర్తిని క‌లిగించే విష‌య‌మని’ ట్విట‌ర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు చిరు. సోనూసూద్ సేవ‌ల‌ను గుర్తు చేస్తూ పుస్త‌కం రావ‌డంతో చిరు కంగ్రాట్స్ చెప్పారు.  తాజా లుక్‌లో చిరు స్టైలిష్ గా క‌నిపిస్తుండ‌గా..సోనూసూద్ మెడ‌లో రుద్రాక్ష మాల‌, నుదిట‌న బొట్టుతో న‌ల్ల‌టి కుర్తాను వేసుకుని కోర‌మీసాల‌తో స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు.

ఇక రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు అండగా నిలవనున్నాడు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని.. ఇలా ఒకటి కాదు చాలా మందికి సాయం చేసాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.