కరోనా వల్ల టాలీవుడ్ కు సినిమాలకు కలిసి రాలేదు కానీ.. పెళ్లిళ్లకు మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. వరుసగా ఒకరి తర్వాత ఒకరి పెళ్లిళ్లు జరుగుతూనే వచ్చాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నిఖిల్, నితిన్ ఇటీవల టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. రీసెంట్ గా మెగా నిహారిక ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరిగాయి. ఇక దీనితో ప్రస్తుతం ఫోకస్ మొత్తం టాలీవుడ్ లో ఉన్న బ్యాచిలర్స్ పై పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు శిరీష్ పెళ్లి ప్రస్తావన కూడా వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం తేజ్ చేసిన వ్యాఖ్యలే.. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. వయసులో తన కంటే అల్లు శిరీష్ పెద్దవాడని, త్వరలోనే అతని పెళ్లి జరగబోతోందని సాయితేజ్ చెప్పాడు. దీంతో శిరీష్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇక దీనిపై శిరీష్ స్పందించి.. `తేజూ సరదాగా జోక్ చేసి ఉంటాడు. మీరు సీరియస్‌గా తీసుకున్నారు. నేను సింగిల్ గా ఉన్నా కూడా మా పేరెంట్స్ చిల్ గానే ఉన్నారు.. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అన్ని విషయాలూ చెబుతాన`ని శిరీష్ ట్వీట్ చేశాడు.
Hahahaha. What!!! No. I’m sure Tej meant it as a joke and all you guys took it too seriously. My parents are chill abt me being single. Whenever I decide to get married I’ll tell you all myself. https://t.co/xkhWpctwDH
— Allu Sirish (@AlluSirish) December 17, 2020
కాగా ఆమధ్య తేజ్ పెళ్లి గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు వచ్చే ఏడాది సమ్మర్ లో పెళ్లి కూడా ఉంటుందన్న వార్తలు వినిపించాయి. మరోవైపు తేజ్ మాత్రం నో పెళ్లి అంటున్నాడు. మరి పెళ్లి చేసుకోను చేసుకోను అన్న రానానే సైలెంట్ గా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు. తేజ్ ఎప్పుడు చేసుకుంటాడో చూద్దాం.
ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాతో పాటు కార్తీక్ దండు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























