‘చెప్పినా ఎవరూ నమ్మరు’ రిలీజ్ డేట్ ఫిక్స్

2020 Telugu Movies, Cheppina Evaru Nammaru Movie Release, Cheppina Evaru Nammaru Movie Release Date, Cheppina Evaru Nammaru Movie Release Date Confirmed, Cheppina Evaru Nammaru Telugu Movie, Cheppina Evaru Nammaru Telugu Movie News, Cheppina Evaru Nammaru Telugu Movie Release, Cheppina Evaru Nammaru Telugu Movie Release Date, Cheppina Evaru Nammaru Telugu Movie Updates, Telugu Filmnagar, Tollywood Updates

ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. గోవా,హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసినట్టు తెలిపారు చిత్రయూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. త్వరలోనే ట్రైలర్ లను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటుచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. న్యూ ఇయర్ గిఫ్ట్ గా జనవరి 1న విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారని.. థియేటర్ లోనే సినిమాను రిలీజ్ చేస్తున్నామని.. అంతేకాదు థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు భయపడాల్సిన అవసరం లేదు, థియేటర్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఈ సినిమా చూసి అందరి దీవెనలు మాటీం కు వుండాలని కొరుకుంటున్నానని” అన్నారు.

కాగా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. మురళి శ్రీనివాసులు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బురన్ షేక్, అఖిల్ వల్లూరి అందిస్తుండగా.. జగ్దీద్ వేముల సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.