లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందనే. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే “మాస్టర్” టీజర్ మిలియన్ వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ టీజర్ కు ఏకంగా 5 లక్షలకు పైగా కామెంట్స్ రావడంతో ఈ టీజర్ మోస్ట్ కామెంటెడ్ ఇండియన్ టీజర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసారు. రేపు అంటే డిసెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా తెలుగు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ ను న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు గతకొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: