కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయం లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ సంక్షోభం లో చిక్కుకున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి 8 నెలలు గడిచినా చిత్ర పరిశ్రమ లో పెద్ద మార్పు ఏమీ లేదు. షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా చిన్న సినిమాలు తప్ప పెద్ద హీరోల మూవీస్ షూటింగ్స్ ప్రారంభం కాలేదు. థియేటర్స్ కు ఓపెనింగ్ కు ముందు కొంత మంది నిర్మాతలు తమ మూవీస్ ను OTT ల ద్వారా రిలీజ్ చేశారు.మరికొంత మంది తమ మూవీస్ ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని వెయిటింగ్ లో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉత్తరాది రాష్ట్రాలలో థియేటర్స్ ప్రారంభం అయినా తగినన్ని మూవీస్ లేకపోవడం తో , టాలీవుడ్ లో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ ను హిందీ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హిందీ చిత్రాల కంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ మంచి వసూళ్ళు రాబడుతున్నాయని సమాచారం. ఢిల్లీ , బీహార్ , UP, MP , చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో 70 శాతం తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ పైనే ఆధారపడి ఉన్నాయనీ , తెలుగు , తమిళ హీరోల మరిన్ని మాస్ మసాలా మూవీస్ ను హిందీ లో డబ్ చేసి రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ ,టాలీవుడ్ మూవీస్ రీమేక్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు డబ్బింగ్ మూవీస్ పై దృష్టి పెట్టడం విశేషం.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























