రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా… ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగించుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు రమేష్ వర్మ ఇందులో పాల్గొంటున్నారు.
కాగా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ సుజిత్ వాసుదేవ్ అందిస్తున్నాడు.
మరి ‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో, ఉన్నత ప్రమాణాలతో తీస్తున్నారు. చూద్దాం మరి ఈసినిమా కూడా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో..లేదో..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: