ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఇప్పుడు చాలా గ్యాప్ తో మరో సినిమాతో వస్తున్నాడు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డర్టీ హరి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని… విడుదలకు సిద్ధంగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ట్రయిలర్ 2.0 పేరుతో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ట్రయిలర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ కాస్త విభిన్నంగా ఉందని చెప్పొచ్చు. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు సస్పెన్స్ కూడా ఉందని అర్థమవుతోంది. ఒకరిని ప్రేమించడం.. ఇంకొకరితో సెక్స్ చేసిందని చెప్పడంతో ఈ రెండో ట్రైరల్ మొదలవుతుంది. క్రైమ్ చుట్టూ కథ తిరిగేట్టు కనిపిస్తోంది. మరి మొదటిసారి ఎంఎస్ రాజు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. చూద్దాం మరి ఈ రొమాన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో.
Here’s Vibrant Trailer 2️⃣.0️⃣ from @MSRajuOfficial‘s #DirtyHari 😋 ► https://t.co/mZCFAVnqCK#DirtyHari Premieres Dec 18th on @FridayMoviesATT@HylifeEnt @SpjCreations @ShravanReddy7_ @iRuhaniSharma @simratkaur_16 @markkrobin pic.twitter.com/WfzvjZjVIX
— Telugu FilmNagar (@telugufilmnagar) December 9, 2020
కాగా ఈ సినిమాకు ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు కూడా అందిస్తున్నారు. పరిచ గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్.కె.రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























