పెళ్ళికూతురు తో చిరు సెల్ఫీ

Mega Star Chiranjeevi,Chiranjeevi Takes An Adorable Selfie With Bride Niharika Konidela,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Niharika Konidela Wedding Celebrations,Chiranjeevi Selfie With Niharika,Mega Star Chiranjeevi Latest News, Chiranjeevi Adorable Selfie With Bride Niharika

మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తనయ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్య తో డిసెంబర్ 9 వ తేదీ రాజస్థాన్ లోని ఉదయ పూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుక, కరోనా కారణంగా పరిమిత బంధు మిత్రుల సమక్షంలో జరగనుంది. డిసెంబర్ 11 వ తేదీ రిసెప్షన్ ను నాగేంద్ర బాబు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపనున్నారు. నాగేంద్ర బాబు ఇంటిలో పెళ్ళిసందడి మొదలయ్యింది. పెళ్ళి కూతురు ను చేసే వేడుకలో 32 సంవత్సరాల క్రితం తన తల్లి పద్మజ నిశ్చితార్థ వేడుకలో ధరించిన శారీ ను నిహారిక ధరించి పెళ్ళికూతురు గా అందంగా కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వేడుకకు హాజరయిన పెదనాన్న చిరంజీవి తో నిహారిక సెల్ఫీ తీసుకున్నారు. అన్నయ్య చిరంజీవి ప్రేమ , సమయం , వయసు అనే సరిహద్దులు దాటిందనీ , ఆయన చిరునవ్వు ప్రతీ క్షణం వేడుకలా మారుస్తుందనీ , కొత్త పెళ్ళికూతురుతో చిరంజీవి సెల్ఫీ ని మెగా బ్రదర్ నాగేంద్ర బాబు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న “ఆచార్య ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. “ఆచార్య ” మూవీ తో పాటు చిరంజీవి పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.