బిగ్ బాస్ 4 – నిన్న హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ జరగగా ఈ రోజు ఫినాలే టాస్క్ పెట్టేసాడు బిగ్ బాస్. మరి ఈ రోజు ఈ టాస్క్ లో ఏం జరిగింది.. ఏమేం సంఘటనలు చోటుచేసుకున్నాయి లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న నామినేషన్ లో నువ్వు మైండ్ తో ఆడతావ్.. నేను హార్ట్ తో ఆడతా అని అఖిల్ ను మోనాల్ అనడం ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అఖిల్. ఇంకా అదే గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటాడు. తర్వాత మోనాల్ అతడికి సారీ చెప్పే ప్రయత్నం చేయగా నీతో మాట్లాడమే వద్దని చెపుతాడు. ఆమె మనసు పెట్టి ఆడుతుందట నేను మెదడుతో ఆడతానట. ఇంట్లో అందరితో బ్రెయిన్ గేమ్ ఆడాను కానీ ఆమె దగ్గర మాత్రం మనసు పెట్టి ఆడాను.. ఈమెతో మనసు పెట్టి ఆడినందుకు నేను హౌలాగాడినా అని సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత ఇదే విషయంపై సోహెల్, అఖిల్ కూడా అరుచుకున్నారు.మరోవైపు అవినాష్, అరియానా దగ్గరకు వెళ్లి మోనాల్ ఆడుతోందని నచ్చ జెప్పాడు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య దూరకు అని అరియానా కూడా సోహెల్ కు సలహా ఇచ్చింది.
ఆ తర్వాత ‘రేస్ టు ఫినాలే’ మొదటి లెవల్ ను స్టార్ట్ చేసేసాడు. గార్డెన్ ఏరియాలో ఒక ఆవు ను పెట్టి ఉంచగా ఆవు అంబా అనగానే కంటెస్టెంట్లు పరుగెత్తుకుంటూ వెళ్లి పాలు కలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఎవరైతే ఎక్కువ పాల బాటిళ్లు నింపుతారో వారు తర్వాతి లెవల్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెవల్లో గెలిచేందుకు ఎలాంటి పనులు చేస్తారనేది ఇంటిసభ్యుల ఇష్టానికే వదిలేశాడు బిగ్ బాస్. ఇక పాలు కల్లెక్ట్ చేసుకోడానికి అందరూ చాలా కష్టపడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు.
ఇక ఇక్కడే అవినాష్ కాస్త అసహనం వ్యక్తం చేసాడు. మోనాల్ తన్నిందని అవినాష్ గొడవ పడ్డాడు. నువ్వు కూడా నన్ను తన్నావంటూ సోహైల్ కాలి దెబ్బను చూపించాడు. అంతేకాదు అందరూ కలిసి టార్గెట్ చేశారని.. నేను గేమ్ ఆడనని మొండికేసాడు. ఇంతలో అరియానా అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు కదా, నాకు చెయ్యవా అని అడగ్గా అతడు… నా గేమ్ ఆడటానికి వచ్చా, సపోర్ట్ చేయడానికి రాలేదు అని కుండ బద్ధలు కొట్టి చెప్పడంతో అరియానా సైలెంట్ అయిపోయింది. హౌస్ లోపలకు వెళ్లి ఏడ్చేశాడు. బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చన్న లూప్ హోల్ పట్టుకొని.. కిచెన్‌లోని పాలు, నీళ్లన్నింటినీ క్యాన్‌లో నింపాడు. అయితే అలా చేయడం రూల్ లో లేదని బిగ్ బాస్ చెప్పడంతో అవినాష్ ముందు గేమ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
రెండో రౌండ్లో అరియానా అవుట్ అవడంతో ఆమె ఏడ్చేసింది. ఫినాలేలో ఉంటానో ఉండనో అని భయమేస్తుందంటూ అవినాష్ తో చెప్పి భాదపడగా.. నువ్వు ఖచ్చితంగా ఉంటావని చెప్పి ఓదార్చాడు. మూడో రౌండ్లో తక్కువ బాటిళ్లు నింపిన కారణంగా మోనాల్ గేమ్ నుండి బయటకు వచ్చేసింది. దీంతో అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక రెండో లెవల్‌కు అర్హత సాధించారు. మరి వీరిలో ఎవరు ఫినాలే మెడల్ సొంతం చేసుకుంటారో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: