బిగ్ బాస్ 4 – కంటెస్టెంట్స్ పై ‘బిగ్ బాస్’ ఆగ్రహం

Bigg Boss 4 Telugu Day "82" Highlights : Bigg Boss Fires On Contestants

బిగ్ బాస్ 4 – రెండు రోజుల పాటు జరిగిన దెయ్యం టాస్క్ ఒక రకంగా ప్రేక్షకులకు బోర్ కొట్టడమే కాకుండా.. అటు బిగ్ బాస్ కు నచ్చలేదు. దీనితో హౌస్ మేట్స్ పై బిగ్ బాస్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది బిగ్ బాస్ ఇళ్లు అని.. బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏదీ జరగదన్న విషయం మరిచిపోయారని, దెయ్యం జలజ మీకు ఇచ్చిన టాస్క్‌లను నిరాకరించారని.. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫామర్ గా ప్రకటించారు బిగ్ బాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దానికి మొదట అభి మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వల్ల నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. ఆ లెటర్‌లో మీరు అఖిల్‌, అభిజిత్‌లు కలిసిన మోనాల్‌ని ఏడిపించారన్న పదాలు నాకు అర్థంకాలేదు.. ఆమెను నేను ఏడిపించాను అంటే పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. అందుకే టాస్క్‌ చేయడానికి నిరాకరించాను. 12వ వారాల జర్నీలో నేను హర్ట్ అయ్యా.. అందుకే దీన్ని పర్సనల్‌గా తీసుకున్నా. ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నా’ అని అభిజిత్ కోరాడు.

అంతేకాదు ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు. దీనితో ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలూ చెప్పుకొచ్చారు. ఏం తప్పు చేసామో మాకు తెలియట్లేదు.. మీరే చెప్పండి బిగ్ బాస్ అని కోరారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు.

తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో రేస్ టు ఫినాలు మొదలైందని.. తిరిగి ఫినాలే వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఉండరని చెప్పారు. ఇప్పటివరకూ ఉన్న కెప్టెన్లలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. ఎవరు వరస్ట్ కెప్టెన్ తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశించారు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలైన రచ్చ. ఇక చాలా సేపు చర్చల అనంతరం బెస్ట్‌ కెప్టెన్‌గా హారిక.. వరస్ట్‌ కెప్టెన్‌గా అరియానాను ఎంపిక చేశారు.

ఇక ఈ రోజు వీకెండ్.. టాస్క్ సరిగ్గా చేయని కారణంగా నాగార్జున హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకుంటారా..? ఎం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.