హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “కెజిఎఫ్ చాప్టర్ 1” కన్నడ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



“కెజిఎఫ్ చాఫ్టర్ 1″మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్2 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో యశ్ , శ్రీనిధి శెట్టి లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ , రవీనా టాండన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే షూటింగ్ షెడ్యూల్ తో “కెజిఎఫ్ చాప్టర్2 “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో జనవరి లో రిలీజ్ కావాల్సిన
“కెజిఎఫ్ చాప్టర్2 “మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. “కెజిఎఫ్ చాప్టర్2 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























