తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తన అందం , అభినయం తో రెజీనా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని రెజీనా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో సూర్ పాంగాయ్ (శూర్పణఖ )తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రెజీనా ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై “గొరిల్లా “మూవీ ఫేమ్ డాన్ శాండీ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ మూవీ షూటింగ్ సోమవారం చెన్నై లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ కి “ఫ్లాష్ బ్యాక్ ” టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శాండీ మాట్లాడుతూ .. కమింగ్ ఆఫ్ ఏజ్ కథ తో “ఫ్లాష్ బ్యాక్ ” మూవీ తెరకెక్కుతుందనీ, షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ 15 రోజులపాటు చెన్నై లో జరుగుతుందనీ , తరువాత షూటింగ్ షెడ్యూల్ ఒక హిల్ స్టేషన్ లో ప్లాన్ చేశామనీ చెప్పారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: