సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మహేష్ సితారతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. బ్లాక్ షార్ట్, బ్లూ టీ షర్టు, ఫేస్ మాస్కు పెట్టుకున్న మహేశ్ సితారతో షాపింగ్ బ్యాగ్ పట్టుకుని వస్తున్న ఫొటో ఇపుడు ఆన్ లైన్ లో హల్‌చల్ చేస్తోంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. 2021 జనవరి నుండి ఈ సినిమాషూటింగ్ ను ప్రారంభించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























