బిగ్ బాస్ 4 – రంగు పడింది.. 12 వారం నామినేషన్స్ లిస్ట్

Bigg Boss Telugu 4 Day"78" Highlights: Contestants Nomination List For 12th Week Is Out

బిగ్ బాస్ 4 – వీకెండ్ అయిపోయింది.. ఇంకా సోమవారం వచ్చిందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం నామినేషన్ ప్రక్రియ కోసం. ఇక నిన్న ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ ఎంత హాట్ గా జరిగింది.. ఫైనల్ గా నామినేషన్ లో ఎవరు ఉన్నారో తెలియాలంటే మాత్రం ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎపిసోడ్ స్టార్టింగే లాస్య వేసిన బిగ్ బాంబ్ వల్ల అభిజిత్ మొదటిసారి గరిట పట్టాడు. దోశలు వేసాడు హౌస్ మేట్స్ కోసం. ఇక మరోవైపు అఖిల్, అరియానా, సోహెల్ అవినాష్ ను ఆటపట్టిస్తుంటారు. నువ్వు షర్ట్ వేసుకోవద్దని అంకుల్ లా ఉన్నావని.. నువ్వు నడుస్తుంటే ముందు పొట్ట నడుస్తున్నట్టు ఉందని కామెడీ చేసింది. ఇంతలో సోహెల్, అఖిల్ వచ్చి అవినాష్‌కు ఈపాటికే పెళ్లి అయితే న‌లుగురు పిల్ల‌లుండేవారంటూ ఆట ప‌ట్టించారు. ఆ తర్వాత మోనాల్ విషయంలో అఖిల్ గత రెండు రోజులుగా డల్ గా ఉండగా.. ‘నా జీవితంలో ముందు నుంచీ ట్ర‌స్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే నీతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడ‌తా. నీ వ‌ల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నా, నీతో అటాచ్‌మెంటే వ‌ద్దు’ అంటూ చెప్పేశాడు.

ఇక అసలైన నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. బ‌జ‌ర్ మోగ‌గానే ఇంటి స‌భ్యులు ప‌రుగెత్తుకెళ్లి త‌ల‌పై టోపీ పెట్టుకున్నారు. గ్రీన్ టోపీలు ధ‌రించిన సోహైల్‌, మోనాల్ సేవ్ అవ‌గా ఎర్ర టోపీలు ధ‌రించిన అరియానా, అఖిల్‌, అభిజిత్‌, అవినాష్ నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చి బయట ఉన్న వాళ్లలో ఒకరితో ఎవరు అనర్హులో చెప్పి స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఇక అక్కడ మొదలయింది అసలైన రచ్చ. సోహెల్, మోనాల్ తో కంపేర్ చేసుకుంటే సోహెల్ స్ట్రాంగ్ కాబట్టి సోహెల్ ను కాస్త చిన్నగానే అడిగారు కానీ.. మోనాల్ తో మాత్రం అఖిల్, అరియానా, అవినాష్ బాగానే అర్గ్యూ చేశారు. కానీ మోనాల్ మాత్రం నేను స్వాప్ చేయను అని చెప్పడంతో బిగ్ బాస్ కెప్టెన్ అయిన హారికకు ఆ భాద్యతలు అప్పగించాడు. దానితో హారిక మోనాల్ ను అభితో స్వాప్ చేసింది. మొత్తానికి ఈ వారం అవినాష్‌, అఖిల్‌, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు.

మరి ఈరోజు నామినేషన్ లోకి వచ్చిన వాళ్లకి ఏదో టాస్క్ ఇచ్చి వారికి స్పెషల్ పవర్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. మరి చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.