‘ఢీ’ సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్

Manchu Vishnu and Director Srinu Vaitla Officially Announce Dhee Movie Sequel

మొత్తానికి అందరూ ఉంహించుకున్నట్టు గానే అప్ డేటే ఇచ్చాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్ ఉందని రెండు రోజుల క్రితమే చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్‌ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని.. ఈ సారి “డబుల్‌ డోస్‌”(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక ‘ఢీ’ కి పనిచేసిన గోపి మోహన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటం మరో విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్, ఇత‌ర న‌టీన‌టులు ఎవ‌ర‌న్న‌ది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఈ సీక్వెల్ అంతకు మించి ఉంటుందో లేదో చూద్దాం ఏం జరుగుతుందో.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్, నవదీప్, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.