సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే

Actress Samantha Akkineni Wishes Lady Super Star Nayanthara On Her Birthday On Twitter

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న తార పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా నయన్ కు అభిమానులతో పాటు పలువురు సినీ సీలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక ఈనేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనట్విట్టర్ ద్వారా నయన్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. వన్ అండ్ ఓన్లీ నయనతారకు హ్యాపీ బర్త్ డే.. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కథువాకుల రెండు కాదల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ ఎన్నో ఏళ్ళ నుండి టాప్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతుంది. ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు.. వెళ్తున్నారు కానీ నయన్ మాత్రం సక్సెస్ ఫుల్ గా తన జర్నీని ఇంకా కొనసాగిస్తూనే వుంది.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్‌, ముక్తి అమ్మాన్‌, అన్నాట్టే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ముక్తి అమ్మాన్ సినిమాలో నయన్ మొదటిసారిగా అమ్మవారి పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.