మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో హీరో హీరోయిన్లు రవితేజ, శ్రుతి హాసన్‌పై ఓ పాటను చిత్రీకరించనున్నారట. ఆ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెపుతున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మెర్సాల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఇక అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకొని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి చూద్దాం ఆలోపు ఏమైనా జరగొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























