‘చిరు’ లేకుండానే ‘ఆచార్య’ షూటింగ్

Acharya Movie Team To Continue Shooting Work Without Chiranjeevi

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయింది. నిజానికి ఈ సినిమా షూట్ ను నిన్ననే ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆశ్చర్యంగా నిన్ననే చిరు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే లేట్ అవ్వడంతో షూటింగ్ మొత్తాన్ని ఆపకుండా ముందుగా చిరు లేని పోర్షన్స్ ను కంప్లీట్ చేసి ఆ తర్వాత చిరు కోలుకున్నాక మిగిలిన పోర్షన్ ను షూట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను గౌతమ్ కిచ్లూ తో హనీమూన్ లో ఉంది. వెనక్కి వచ్చిన తర్వాత ఆచార్య షూటింగ్ లో పాల్గొననుంది

కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.