టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమందికి కాస్త లక్షణాలు ఉండి టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉంటే.. అసలు మాకు ఏ లక్షణాలు లేవు అయినా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోకు కూడా ఇదే జరిగింది. ఆ అగ్ర హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు చిరుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు సంగతేంటంటే.. `ఆచార్య` సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక దీనితో మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
కాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నవంబర్ 9 నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నామని ఐదురోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఇప్పుడు మళ్లీ బ్రేక్ పడింది. చిరు పూర్తిగా కోలుకొని మళ్లీ ఎప్పుడు షూట్ ను స్టార్ట్ చేస్తారో చూడాలి.
ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























