నితిన్ ‘చెక్’ మొదలైంది

Actor Nithiin Check Movie Shooting New Schedule Begins Today

సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ ‌రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా… ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ విషయాన్ని నితిన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. కాగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 

మరి ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్ర‌యాణం, మ‌న‌మంతా..వంటి చిత్రాల‌తో డైరెక్ట‌ర్ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. మరి నితిన్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూద్దాం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌య్యాకే అంధాధున్ తెలుగు రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు నితిన్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.