గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టే చెపుతున్నాడు అడివిశేష్. సినిమా కోసం కంటిన్యూస్ గా 18 గంటలపాటు షూటింగ్ చేశామని.. టీం ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
18 hour continuous shoot for #MajorTheFilm yesterday. I’m proud of the team.
The harder you work, the luckier you get.
🙂
— Adivi Sesh (@AdiviSesh) October 11, 2020
కాగా ఈ సినిమాలో `దబాంగ్ 3` బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా `గూఢచారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
దీనితో పాటు అడివి శేష్ తనకు మంచి సక్సెస్ ఇచ్చిన ‘గూఢచారి’ సీక్వెల్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























