గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు.. ఇందులో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ఎలా జరుపుతున్నారో చూపించారు. వీడియో చివరన స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవడం నేర్చుకో అంటూ రవితేజ సీరియస్‌గా డైలాగ్ చెప్పడం ఉంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























