హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో హీరో విష్ణు మంచు సరసన నాయికగా రుహీ సింగ్ నటిస్తున్నారు. ఇక ఈరోజు ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. డిజైనర్ దుస్తుల్లో ఉన్న రుహీ సింగ్ ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమాలో మోహిని పాత్రలో నటిస్తుంది రుహీ సింగ్.
Presenting Mohini aka @ruhisingh11 from #Mosagallu. Is she part of this scam too? Keep guessing! #MohiniFromMosagallu@ivishnumanchu @MsKajalAggarwal @SunielVShetty @Naveenc212 @pnavdeep26 @TheLeapMan @24FramesFactory @MangoMusicLabel pic.twitter.com/6zITRbIiKs
— 24 Frames Factory (@24FramesFactory) October 8, 2020
కాగా ఇంకా ఈసినిమాలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా..నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విష్ణు అర్జున్ పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అను పాత్రలో నటిస్తుంది. విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆయన సోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతోంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























