తమన్నా కు కరోనా పాజిటివ్

Actress Tamannaah tests positive for corona virus

కరోనా వల్ల ఆగిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక హీరో హీరోయిన్స్ ఎవరి సెట్ లలో వాళ్లు వాలిపోతున్నారు. ప్రభాస్ ఏకంగా రాధే శ్యామ్ షూట్ కోసం ఇటలీనే వెళ్ళిపోయాడు. ఇక ఇందులో భాగంగానే మిల్కీ బ్యూటీ కూడా గత కొద్దీ రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టింది తమన్నా. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి ఆమె ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే రెండ్రోజులుగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోగా… కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యుల సలహా, సూచనలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. కాగా ఇటీవలే తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే అప్పుడు తమన్నాకు నెగిటివ్ అనే వచ్చింది. అలా షూట్ కు వచ్చిందో లేదో కరోనా సోకింది.

తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. . ఇంకా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ సినిమా రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్‌’ తెలుగు రీమేక్‌లో కూడా తమన్నా నటిస్తుంది. ఇంకా “క్వీన్ ” మూవీ తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.