సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ తమ సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగత విషయాలు కూడా తెలుపుతుంటారు. ఒక రకంగా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు అనుష్క కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేసింది.అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రకటిస్తూ…. మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి నా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hi all Hope you all doing well and keeping safe . Follow me on my official twitter account @MsAnushkaShetty for some interesting updates in the coming days for all of you ! pic.twitter.com/SjsbnOZiRj
— Anushka Shetty (@MsAnushkaShetty) September 30, 2020
ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































