బిగ్ బాస్ 4 – నాలుగో వారం నామినేషన్ లిస్ట్

Bigg Boss Season 4 Contestant Nominations For Elimination Are Out

బిగ్ బాస్ మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సోమవారం అంటే నామినేషన్ డే. ఈ డే కోసం హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏం టాస్క్ ఇస్తారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చూస్తుంటారు. మరి 22 రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో.. ఎవరు నామినేషన్ లోకి వచ్చారో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రోజులాగే సోమ‌వారం ఎసిపోడ్ గోంగూర తోట కాడ కాపుకాశా అనే పాటతో మొద‌లైంది. ఆ త‌ర్వాత మార్నింగ్ మ‌స్తీలో భాగంగా ఫన్నీ టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. ఒక్కొక్కరు తమ పెరఫార్మెన్స్ ను చూపించారు. ఇక ఆ త‌ర్వాత దివి నామినేష‌న్ విష‌యంలో మెహ‌బూబ్ తో పాటు అభిజిత్‌తో చ‌ర్చించింది. అనంతరం అవినాష్‌.. అరియానా.. ఆ త‌ర్వాత మోనాల్ ద‌గ్గ‌ర‌ కొంత సేపు కామెడీ చేసి అందర్నీ న‌వ్వించాడు.

ఇక అందరూ వెయిట్ చేసే నామినేషన్ ప్రక్రియ వచ్చింది. ఇందులో సోహైల్ – అఖిల్ హిట్‌మ్యాన్‌లుగా ఉంటార‌ని తెలిపాడు బిగ్ బాస్. వీరిద్ద‌రికి ఐదు వేలు ఇచ్చిన బిగ్ బాస్, మిగ‌తా ఇంటి స‌భ్యుల‌కు ప‌దివేలు ఇచ్చారు. బ‌జ‌ర్ మోగిన ప్ర‌తి సారి లివింగ్ ఏరియాలో ఉన్న ఇంటి స‌భ్యులు హిట్ మెన్‌లు ఉన్న రూంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవ‌రైతే ముందుగా వెళ‌తారో వారికి నామినేష‌న్ చేసే అవ‌కాశం దక్కుతుంది. ఇందులో మొత్తం ఐదు బ‌జర్స్ మోగుతాయి. అవి మోగిన ప్ర‌తి సారి డెన్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక హిట్ మ్యాన్స్‌కు సంబంధించిన బ‌జ‌ర్ కూడా మోగుతుంది. ఆ బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ఎవ‌రైతే గ‌న్ చేజిక్కించుకుంటారో వారికి ఇంటి స‌భ్యుల ద‌గ్గ‌ర ఉన్న ప‌దివేలు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది. దేవి ఇచ్చిన బిగ్ బాంబ్ తో అరియానా ఈ వారం సేవ్ అయిన విష‌యం తెలిసిందే.

ఈ ప్ర‌క్రియ‌లో ముందు అమ్మ రాజ‌శేఖ‌ర్ వెళ్ళి.. స్వాతి దీక్షిత్‌ను నామినేట్ చేశారు. ఆ త‌ర్వాత మెహబూబ్ వెళ్లి.. అభిజిత్‌ని, అరియానా గ్లోరి.. లాస్యని, హారిక‌.. మెహబూబ్‌ని , సుజాత.. కుమార్ సాయిని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన వాళ్ళు వారికి అనిపించిన రీజన్స్ హిట్ మ్యాన్స్‌తో చెప్ప‌గా ఈ విష‌యాన్ని వీరు వెళ్లి నామినేట్ అయిన వాళ్ళ‌కు చెప్పారు. అయితే హిట్ మెన్లుగా ఉన్న అఖిల్, సొహైల్‌లలో నాలుగు సార్లు గన్‌ని చేజిక్కించుకుని అఖిల్ సేవ్ అయ్యాడు. సోహైల్ నామినేష‌న్ బోర్డ్ త‌గిలించుకున్నాడు.

ఇక అఖిల్‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చాడు బిగ్ బాస్. మ‌రొక‌రిని నామినేట్ చేయ‌మ‌ని చెప్ప‌గా, అత‌ను హారిక‌ని నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్,హారిక ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.