‘అల్లుడు అదుర్స్’ కూడా మొదలు

Actor Bellamkonda Sreenivas Alludu Adhurs Movie Shooting Kickstarts In Hyderabad

ధైర్యం చేసి టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోలు షూటింగ్ కూడా మొదలుపెట్టి పూర్తి చేసారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరో సెట్స్ లోకి అడుగుపెట్టేసాడు. కరోనా కారణంగా ఆగిన ఈ షూటింగ్ ను ఈ రోజు నుండి మొదలు పెట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేసి.. ఈ సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. మరి అప్పటిలోపు థియేటర్స్ ఓపెన్ అవుతాయా.. లేకపోతే ముందే ఓపెన్ చేస్తారా చూడాలి..!

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభానటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్‌గా నటిస్తుండగా… సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు… గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తమిళ్ లో హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమా తెలుగులో ‘రాక్షసుడు’ గా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు సాయి. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో వెంటనే హిట్ అందుకుంటాడో..?లేదో..? చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.