క్లాసికల్ డ్యాన్సర్ , వాయిస్ ఆర్టిస్ట్ వినీత్ పలు తమిళ , మలయాళ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. కన్నడ , హిందీ భాషలలో నటించిన వినీత్ తెలుగు లో కొన్ని సినిమాలలో హీరోగా నటించారు. బ్లాక్ బస్టర్ “ప్రేమ దేశం “, “చంద్ర ముఖి ” మూవీస్ లో వినీత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ లో డ్యాన్సింగ్ ఎక్సర్ సైజ్ లతో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వినీత్ తన స్టూడెంట్స్ కు ఆన్ లైన్ లో డ్యాన్స్ క్లాసెస్ నిర్వ హిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో వినీత్ పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్న వినీత్ దాదాపు 15 సంవత్సరాల తరువాత “రంగ్ దే !” తెలుగు మూవీలో ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: