టాలీవుడ్ లో బిజీ హీరో గా కొనసాగుతున్న హీరో నాని తన సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V”మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. “V”మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో నాని తన మనసులో మాట ను వెల్లడించారు. తాను వరుస టాలీవుడ్ మూవీస్ లో నటించాలని అనుకొంటున్నాననీ , పాన్ ఇండియా , బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి లేదనీ , తాను టాలీవుడ్ మూవీస్ తో పూర్తి సంతృప్తిగా ఉన్నాననీ నాని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్నారు. సుమారు 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది. త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభం కానుంది. “టక్ జగదీష్ ” మూవీ తరువాత నాని , సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో
రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. “V”మూవీ OTT రిలీజ్ గురించి మాట్లాడుతూ .. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో OTT మినహా మరో మార్గం లేదని , కరెక్ట్ టైమ్ లో OTT ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయం సరైనది అనిపించిందనీ , హీరోగా తనకు కొత్త అనుభవం అనీ నాని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: