‘తమిళ్’ హీరో ‘తెలుగు’ ట్వీట్

Tamil Actor Vijay Antony Posts A Tweet In Telugu As He Joins Back Movie Shooting

బిచ్చగాడు సాధించిన అద్భుత విజయంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందులో ఎంతో కొంత మ్యాటర్ వుండే ఉంటుంది అనేలా ఆడియన్స్ మైండ్ ను ఫిక్స్ చేసేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. వీటితో పాటు బిచ్చగాడు2 సినిమాను కూడా చేస్తున్నాడు. తన పుట్టినరోజు నాడు తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో ప్రకటించారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు దూరంగా ఉండగా ఇప్పుడు తిరిగి షూటింగ్ కు వెళ్ళబోతున్నట్టు తెలిపాడు విజయ్ ఆంటోనీ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తెలుగులో ట్వీట్ చేయడం. నన్ను నమ్ముకున్న నిర్మాత దర్శక మరియు సినీ కార్మిక సోదరుల శ్రేయస్సున్ని ఆకాంక్షిస్తూ … నేను రేపటి నుండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ లో పాలుగొనబోతున్నాను.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తూ… నేను… మీ (విజయ ఆంటోని) అంటూ తెలుగులో ట్వీట్ చేసాడు. ఇక దీనితో తెలుగు అభిమానులు విజయ్ తెలుగు ట్వీట్ చూసి ఫిదా అవుతున్నారు.

కాగా కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోవడంతో.. తన సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అండగా ఉండేందుకు తన పారితోషికంలో 25 శాతాన్ని విజయ్ ఆంటోనీ తగ్గించుకున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =